అక్క‌డి రూముల‌ను కండోమ్‌ల‌తో నింపేస్తారు.. ‘రేయింబ‌వ‌ళ్లు అదే ప‌ని’

అంతా అనుభ‌వించేశాము. మేముంటున్న రూముల‌ను మొద‌ట‌గా కండోమ్‌ల‌తో నింపేస్తారు. ఇక అప్ప‌టి నుండి ఒక‌రని, ఇద్ద‌ర‌ని, ముగ్గుర‌ని కాదు. లోప‌ల‌కు వ‌చ్చిన వారిని ఒక‌రి త‌రువాత మ‌రొక‌ర‌ని సంతృప్తి ప‌రుస్తూనే ఉండాలి. నీర‌సించి పోయాన‌ని నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వాళ్ల‌ను వేరే వాళ్ల ద‌గ్గ‌ర‌కు పంపించ కూడ‌దు. రాత్రి, ప‌గ‌లు అన్న తేడా లేకుండా రేయంబ‌వ‌ళ్లు నా ద‌గ్గ‌ర‌కు పంపించిన క‌స్ట‌మ‌ర్ల‌తో గ‌డ‌పాల్సిందే. మిష‌న్ మాదిరి ప‌ని చేస్తూనే ఉండాలి.

ఒక్క రోజుకు ఇంత మంది అన్న క‌చ్చిత‌మైన సంఖ్యేమీ లేదు. ఆఖ‌ర‌కు డేట్ స‌మ‌యంలోను వారు డ‌బ్బాల్లో తెచ్చిచ్చిన కండోమ్‌ల‌ను వేసుకుని క‌స్ట‌మ‌ర్ల‌తో గ‌డ‌పాల్సి ఉంటుంది. ఇలా చేసిచేసీ పొద్దుగూకేలోగా నీర‌స‌మొచ్చిన‌ట్టు ఉంటుంది. తినేందుకు స‌క్ర‌మంగా తిండి ఉండ‌దు. సుస్తి అవుతుంది. వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్‌ల‌లో కొంద‌రు హార్స్‌గా ప్ర‌వ‌ర్తించినా, మ‌రికొంద‌రు కుటుంబ స‌భ్యుల్లా అర్ధం చేసుకుంటారు. ఇంకొంద‌రు రాక్ష‌సుల్లా ప‌డి ర‌క్కుతారు. ఇలా అతి త‌క్కువ స‌మ‌యంలో జీవిత‌మంటే ఏంటో తెలిసొచ్చింది.

ఉపాధి నిమిత్తం క‌న్స‌ల్టెంట్‌ల ద్వారా ఢిల్లీ వెళ్లొచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ చెప్పుకొచ్చిన ఆవేద‌న ఇది. ప‌సి వ‌య‌సు నాడే పెళ్లి చేయ‌డంతో భ‌ర్త తీరుతో విసిగి వేసారింది. ఆస్తి పంప‌కాల్లో వాటా ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని బంధుగ‌ణం ముంద‌స్తుగా భ‌ర్త‌తోనే ఆమెపై దాడి చేయించారు. బంధువుల‌ చ‌ప్పుడు మాట‌లు విని త‌న‌ను చంపడానికి వ‌చ్చిన భ‌ర్త‌తో వేగ‌లేక త‌న పుట్టిళ్ల‌యిన త‌న‌క‌ళ్లుకు వ‌చ్చేసి త‌ల్లి దండ్రుల‌తో క‌లిసి ఉండేందుకు నిర్ణ‌యించుకుంది.

అదే స‌మ‌యంలో ఇళ్లు గ‌డిచేందుకు ఉపాధి నిమిత్త‌మ‌ని హైద‌రాబాద్ పేరుతో ఆ మహిళను ఢిల్లీకి చేర్చింది మరో మహిళ. తీసుకెళ్ల‌డం తీసుకెళ్ల‌డం క‌న్స‌ల్టెంట్‌ల ద్వారా ఢిల్లీ జీవీ రోడ్డులోని వ్య‌భిచార గృహంలో వ‌దిలిపెట్టింది. ఇక అప్ప‌టి నుండి మాట‌లు దాట వేస్తూ మహిళ బాధితురాలి రూపు రేఖ‌ల‌ను మార్చేశారు. ఇదేంట‌ని అడుగుతున్నా ఢిల్లీలో ప‌నిమ‌నుషులు ఇంతేనంటూ మహిళ బాధితురాలిని సుంద‌రంగా అలంక‌రించారు. చివ‌ర‌కు వ్య‌భిచార గృహంలోని ఓ మ‌హిళ ద్వార మహిళ బాధితురాలికి అస‌లు విష‌యం తెలిసింది.

ఆ త‌రువాత ఏం జ‌రిగింద‌న్న‌ది మహిళ బాధితురాలి మాట‌ల్లో.., ఇటువంటి ప‌ని అయితే అవ‌స‌రం లేదని చెప్పా. అప్ప‌టికే కొత్త పాప వ‌చ్చిందంటూ క‌స్ట‌మ‌ర్‌కు నిర్వాహ‌కులు ఫోన్ చేయ‌డంతో ఆయ‌న వ‌చ్చేశాడు. కొత్త పాప వ‌చ్చిందంటే చాలు వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్ నానా హింస‌లు పెడ‌తాడు. ఎంత‌లా అంటే చెప్ప‌లేనంత‌లా అన్న‌మాట‌. బ‌ల‌వంతాన క‌స్ట‌మ‌ర్ వ‌చ్చిన‌ రూములోకి నెట్టారు. రూములోకి అడుగు పెట్టాక ఒంటి మీద క‌నీసం నూలుపోగు కూడా ఉండ‌నీరు.

ఒక నెల అన్నం కూడా తినలే..

రూములోకి అడుగు పెట్టీపెట్ట‌గానే అమ్మ క‌డుపులో నుండి బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చామో సేమ్ టు సేమ్ రూములో కూడా ఒంటిపై బ‌ట్ట ఉండ‌నీరు. ఒక‌వేళ వారు చెప్పిన‌ట్టు చెయ్య‌మంటూ ఎదురు తిరిగితే సిగ‌రేట్లు, బీడీలు వెలిగించి వాటితో శ‌రీరంపై కాలుస్తారు. అవి కాకుంటే మందు తాపుతారు. లేదా మ‌త్తు మందునైనా తెచ్చి బ‌ల‌వంతంగా పీల్చేలా చేస్తారు. ఆ మ‌త్తులోనైనా చెప్పింది చేస్తారులేన‌న్న‌ది వారి భావ‌న‌. అలా అన్ని విధాలా అగ‌చాట్లు పెడ‌తారు. చివ‌ర‌కు వాళ్లు చెప్పిన‌ట్టు చేయ‌లేద‌న్న కోపంతో క‌ళ్ల‌ల్లో, నోట్లో కారం పెడ‌తారు. వారు అలా చేయ‌డంతో ఒక నెలంతా అన్నం, నీళ్లు లేకుండా ఉండిపోయా.

మొద‌టి సారిగా న‌న్ను బ‌ల‌వంతంగా క‌స్ట‌మ‌ర్ రూములోకి తోసిన‌ప్పుడు అక్క‌డి వ్య‌క్తి నానా ఇదిగా ఇది చేశాడు. ఇష్టం లేద‌ని చెప్పినా, ఒప్పుకోక‌పోయినా చేశాడు. నేను డ‌బ్బులు ఇచ్చాను క‌దా..? ఎందుకు చెయ్య‌వంటూ బ‌ల‌వంతంగా చేయించాడు. ఇలా అన్ని విధాలా బాధ‌లు అనుభ‌వించి చివ‌ర‌కు పోలీసుల సాయంతో బ‌య‌ట‌ప‌డిన‌ట్టు చెప్పుకొచ్చింది మహిళ బాధితురాలు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.