నీ భ‌ర్త‌ను మాతో పంపించ‌డానికి ప్లాన్ ఆలోచించు. ఎందుకంటే మాకు బాగా న‌చ్చాడు. వాడితో ఒక్క‌రోజు కాదు కంటిన్యూగా ఎంజాయ్ చెయ్యాల‌నిపిస్తుంది. వాడిని మాతోపాటు 30 రోజులు ఫారెన్‌కు తీసుకెళ్లాల‌నుకుంటున్నాము. ఎంత అడిగినా ప‌ర్వాలేదు. మేమిస్తాం. రోజుకి ల‌క్ష చొప్పున 30 రోజుల‌కు 30 ల‌క్ష‌లు తీస్కో.

ఇలా ఇంటి ప‌ని మ‌నిషిలో లేనిపోని ఆశ‌లు రేపి ఆమె భ‌ర్త‌ను త‌మ‌తోపాటు తీసుకెళ్లారు కొంద‌రు ఆంటీలు. ముందుగా అనుకున్న‌ట్టే ఫారెన్‌లో నెల రోజుల‌పాటు ఎంజాయ్ చేసి స్వదేశానికి తిరిగొచ్చారు. అయితే, ఆ మ‌ర్నాడే ప‌న‌బ్బాయిని బేర‌మాడిన ఇంటి య‌జ‌మానురాలు విగ‌త జీవిగా ద‌ర్శ‌న‌మిచ్చింది. మృతురాలి కుటుంబ స‌భ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేసిన పోలీసులు అస‌లు నిజాలు తెలిసి ఖంగుతిన్నారు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్‌లోని దులాల్ ప్రాంతంలో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది.

కేసును పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేసిన‌ పోలీసులు వెల్ల‌డించిన నిజా నిజాలు ఇలా ఉన్నాయి. కాగా, ప‌శ్చిమ బెంగాల్ మంభుం జిల్లాలోని ధ‌న్‌బాద్ అనే కుగ్రామానికి చెందిన దులాల్‌, అనురూప నూత‌న దంప‌తులు. బ‌తుకుదెరువు కోస‌మ‌ని కోల్‌క‌తా బంటాలా ప్రాంతంలోని అభిజిత్ అనే బిజినెస్‌మేన్‌ ఇంట్లో ప‌నికి చేరారు. అభిజిత్ త‌న బిజినెస్ విస్త‌ర‌ణ‌లో భాగంగా ప‌లు రాష్ట్రాల‌కు నిత్యం రాక‌పోక‌లు కొన‌సాగిస్తూ ఉండేవాడు. అదే అదునుగా భావించిన అభిజిత్ భార్య పనిమ‌నిషి భ‌ర్త దులాల్‌పై క‌న్నేసింది.

త‌ర‌చూ త‌న కోర్కెలు తీర్చాలంటూ దులాల్ వెంట ప‌డింది. అందుకు దులాల్ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో అత‌ని భార్య అనురూప దుస్తులు మార్చుకుంటుండ‌గా వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేయ‌సాగింది. త‌న‌కు లొంగ‌క‌పోతే నీ భార్య వీడియోలో నెట్టింట్లో పెడ‌తానంటూ ప‌న‌బ్బాయి దులాల్‌ను వేధించ‌సాగింది. ఈ విష‌యం కాస్తా దులాల్ భార్య‌కు తెలియ‌డంతో ఇంటి య‌జ‌మానురాలిని నిల‌దీసింది. చివ‌ర‌కు డ‌బ్బు ఆశ చూపి అనురూప‌ను మార్చేసింది ఆ ఇంటి య‌జ‌మానురాలు.

ఇలా ఆ ఇద్ద‌రు ఆడిన నాట‌కంలో దులాల్ పావులా మారాడు. కొన్ని నెల‌ల‌పాటు ఇంటి య‌జమానురాలు త‌న శృంగార కోర్కెల‌ను తీర్చుకునేందుకు దులాల్‌ను వాడుకుంది. ఈ విష‌యం అనురూప‌కు తెలిసినా త‌న వీడియో నెట్టింట్లో పెడుతుందని, అలా చేస్తే తాను చ‌నిపోతానంటూ దులాల్‌ను ఒప్పించిమ‌రీ య‌జ‌మానురాలి గ‌దికి పంప‌సాగింది. ఇలా కొన్ని నెల‌లు గ‌డిచాక ఇంటి య‌జ‌మానురాలు త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ఫారెన్ ట్రిప్ వేశారు. ఆ విష‌యం అనురూప‌కు తెలిపి ఎప్ప‌టిలానే బెదిరింపుల పేరుతో ప‌న‌బ్బాయిని రోజుకు ల‌క్ష చొప్పున 30 రోజుల‌కు మాట్లాడుకుని ఫారెన్‌కు తీసుకెళ్లారు.

ఆవేశంతో హత్య..

అయితే, ఫారెన్ నుండి తిరిగొచ్చిన త‌రువాత భ‌ర్త‌కు వారితో పంపించినందుకుగాను త‌న‌కు ముట్టాల్సిన 30 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆవేశానికి లోనైన అనురూప ఇంటి య‌జ‌మానురాలిని హ‌త్య చేసింది. ఇంటి స‌భ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఇంట్లోని అంద‌ర్నీ విచారించిన పోలీసులు అనురూప‌ను కూడా వారి స్టైల్లో గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో అస‌లు నిజాన్ని ఒప్పుకుంది. ఇంటి య‌జ‌మానురాలిని తానే హ‌త్య చేశానంటూ గ‌త చ‌రిత్ర‌ను చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం బంటాల ప‌ట్ట‌ణ పోలీసు స్టేష‌న్‌లో రిమాండ్ ఖైదీగా ఉంది. అనురూప కేసు విచార‌ణ‌కు సంబంధించి ఈ నెల 20న కోర్టు తీర్పును వెలువ‌రించనుంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.