కుటుంబ పోషణ కోసం భర్త విదేశాల్లో కష్టపడుతుంటే.. భార్య ఏమో మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త కుటుంబ సభ్యులు ఆమెతో పాటు ఆమె ప్రియుడిని పట్టుకుని ముక్కు కోశారు. రామాయణంలో శూర్పణఖ ఘటనను గుర్తు చేసిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య లో చోటు చేసుకుంది.

అయోధ్య జిల్లా కంద్‌ పిప్రా గ్రామానికి చెందిన వ్యక్తి కొన్నాళ్ల క్రితం వివాహమైంది. కాగా అతను కుటుంబ పోషణ నిమిత్తం దుబాయ్‌ వెళ్లాడు. భార్య పిల్లలతో కలిసి గ్రామంలో నివసిస్తోంది. 23 ఏళ్ల వ్యక్తి వివాహిత మహిళ (30)తో సంబంధం పెట్టుకున్నాడు. భర్త ఇంట్లో లేకపోవడంతో తన ప్రియుడిని ఇంటికే పిలుపించుకుని రాసలీలలు సాగించేది. ఈ విషయం భర్త కుటుంబ సభ్యులు తెలిసింది. దీంతో ఆమెను రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుకోవాలని నిశ్చయించుకున్నారు.

మంగళవారం వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో స్థానికులతో కలిసి వచ్చిన ఆ మహిళ మావ, బావ ఆ జంటను పట్టుకుని స్తంభానికి కట్టేశారు. అనంతరం వారిద్దరిని చితకబాది ముక్కులు కోసేశారు. తీవ్రరక్తం కావడంతో స్తానికులు వారిని ఆస్పత్రికి తరలించి అనంతరం పోలీసులకు అప్పగించారు.

ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసు అధికారి ఆశిష్ తివారీ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. అలాగే బాధితులిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీసు బలగాన్ని మోహరించినట్టు తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.