అడ్వెంచర్ అండ్ రొమాంటిక్ మూవీ బ్లూ లాగూన్ సినిమా చూసారా.. ఇందులో ఎమిలీన్(బ్రూక్ షీల్డ్స్ ఈ క్యారెక్టర్ చేశారు), రిచర్డ్(క్రిస్టోఫర్ అట్కిన్స్) ఓ దీవిలో చిక్కుకుపోతారు. అక్కడి నుండి బయటపడడం వారి వల్ల అవదు.దీంతో ఆ దీవిలోని  పరిస్థితులకు వాళ్ళే అలవాటుపడిపోతారు. ప్రేమలో ఉండిపోయి.. రొమాన్స్ లో తేలియాడుతూ ఉంటుంది ఈ జంట.

ఇలా తామిద్దరమే ఏకాంతంగా గడపాలని ఎన్నో జంటలు అనుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా స్టార్ కపుల్స్ బ్లూ లాగూన్ సినిమాలో లాగ రొమాంటిక్ గా.. తమ ఫాంటసీ లను తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి కోవిద్-19 కారణంగా సరైన సమయం దొరికింది. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో హాలీవుడ్ జంటలు ఫుల్ రొమాన్స్ లో మునిగిపోయాయి. తమ అన్ని సెక్సువల్ ఫాంటసీలను ఈ సమయంలో తీర్చుకుంటున్నారు. కొందరు కపుల్స్ తమ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నారు.

డేవిడ్ బెక్ హామ్, విక్టోరియా బెక్ హామ్ కుమారుడు బ్రూక్లిన్ బెక్ హామ్, నటి నికోలా పెల్ట్జ్ తో ప్రేమలో మునిగిపోయి ఉన్నాడు. వారిద్దరూ నికోలా అపార్ట్మెంట్ లో గత కొద్దిరోజులుగా ఉంటున్నారు. తాము సెక్సువల్ గా బాగా ఎంజాయ్ చేస్తున్నామంటూ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ‘కామసూత్ర సమయం ఇది’ అని తమ పరిస్థితి గురించి వివరించారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారికి భయపడి ఇళ్లల్లో ఉండిపోయి ఉంది.. ఇలాంటి కపుల్స్ బెడ్ రూమ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నామంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.

లాక్ డౌన్ సమయాల్లో లవ్:

లాక్ డౌన్ సమయాల్లో కపుల్స్ మధ్య రొమాన్స్ తారాస్థాయికి చేరుకుంటుందని రిలేషన్ షిప్ ఎక్స్పర్ట్ డాక్టర్ నిషా ఖన్నా చెబుతున్నారు. యుక్త వయసులో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. కెరీర్ లో ఎదగాలి.. ఎప్పటికప్పుడు ఇచ్చిన పని చేసేయాలి.. ఇలా ఎవరికి వారే బిజీగా ఉండడం వలన జంటలకు ఒకరితో మరొకరు గడిపే సమయం చాలా తక్కువ.. రొమాన్స్ కు కూడా పెద్దగా సమయం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని డాక్టర్ నిషా తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమయంలో ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నారని.. మరికొందరు వేరొకరి కంపెనీని ఎంజాయ్ చేయలేక ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఆమె అన్నారు.

సైకోఅనలిస్ట్, సెక్సాలజిస్ట్ డాక్టర్ షర్మిల మజుందార్ మాట్లాడుతూ కపుల్స్ చాలా మంది తమ డైలీ లైఫ్ లో చాలా బిజీగా గడుపుతూ ఉంటారని.. ఇప్పుడు వారికి సరైన సమయం దొరికిందని.. ఒకరికొక్కరు బాగా దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు. ఆఫీసులకు, ఉద్యోగాలకు దూరంగా ఉంటూ.. ఇళ్లల్లో ఉండడం వలన వారికి టెన్షన్స్ అన్నీ పెద్దగా ఉండవని.. దీంతో తమ భాగస్వామ్యులతో హ్యాపీగా గడుపుతారని అన్నారు. లాక్ డౌన్ అన్నది చాలా జంటలకు కలిసొచ్చిందని.. ఒకరి గురించి మరొకరికి తెలుసుకునే సమయం కూడా ఇదేనని.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడమే కాకుండా.. కమిట్ మెంట్ విషయంలో కొత్త లెవల్స్ కు చేరుకుంటారని ఆమె చెబుతున్నారు. చిరాకు అన్నది తగ్గుతుందని, ఒకరితో మరొకరు గడపడాన్ని ఇకపై ఎక్కువగా ఇష్టపడతారని ఆమె అన్నారు. లాక్ డౌన్ సమయాల్లో చాలా జంటలు సన్నిహితంగా ఉండడాన్ని తాను చూశానని.. తమ తమ బంధాలకు సరికొత్త నిర్వచనాన్ని చాలా జంటలు ఈ సమయంలో వెతుక్కుంటున్నాయని ఆమె అన్నారు. ఈ సమయంలో జంటల మధ్య బంధాలు మరింత దృఢంగా అవుతున్నాయని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సెక్స్ థెరపిస్ట్ డాక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ “జంటలు సెక్సువల్ గా ఎంజాయ్ చేయడానికి, వాళ్ళ ఫిజికల్-ఎమోషనల్ రిలేషన్ షిప్ ను తిరిగి పెంపొందడానికి దేవుడు ఇచ్చిన సమయం ఇదని” ఆయన అన్నారు. కానీ అతిగా సెక్సువల్ లైఫ్ ను ఎంజాయ్ చేయడం కూడా తప్పేనని అంటున్నారు.. చివరికి రొమాన్స్ అన్నది బోర్ కొట్టే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకరి పట్ల మరొకరికి దృఢమైన అనుబంధం లేకపోతే.. ఎక్కువ కాలం రిలేషన్ షిప్ కొనసాగడం కష్టమేనని అంటున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.