హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో, వ్యవస్థాపకుడు రవి ప్రకాష్‌ను కేసులు వెంటాడుతున్నాయి. రవిప్రకాష్‌ను కస్టడీకి కోరుతూ బంజారాహిల్స్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో హైకోర్టు వచ్చే నెల 2 వరకు స్టే ఇవ్వడంతో విచారణ వచ్చేనెల 4వ తేదికి వాయిదా పడింది. రూ.18 కోట్ల గోల్‌మాల్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో రవిప్రకాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు రవిప్రకాష్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే రవిప్రకాష్‌ హైదరాబాద్‌ వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లద్దంటూ కండిషనల్‌ బెయిల్‌ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Nampally 1 Nampally2 Nampally3

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.