ప్రేమ అనే రెండక్షరాలు ఓ యువతి ప్రాణాలు తీసింది. ప్రియుడు చెప్పిన సమయానికి ఇంటికి రాలేదన్న కారణంతో యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. అయితే అసలు ట్విస్ట్‌ ఏంటంటే మృతి చెందిన యువతి, ప్రేమించిన యువకుడు ఇద్దరు కూడా పోలీసులే. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన శరణ్య అనే యువతి రైల్వే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ పెరంబూరు రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటోంది. ఆమెకు సాయుధ బలగాల విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏలుమలై అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది.

కాగా, గురువారం ఏలుమలై పుట్టిన రోజు కావడంతో శరణ్య విధులను త్వరగా ముగించుకుని ప్రియుడి బర్త్‌డే వేడులకు రెడీ అయ్యింది. అయితే సాయంత్రం ఆరు గంటల్లోపు తన క్వార్టర్స్‌కు రావాలని ఏలుమలైకు శరణ్య సూచించింది. ఏలుమలైకు పేదలకు ఆహారం అందించే ప్రాంతాల్లో భద్రత విధులు కేటాయించారు అధికారులు.
కాగా, శరణ్య చెప్పిన సమయానికి ఏలుమలై రాలేదు.

ఇక రాత్రి 9 గంటలకు ఏలుమలై శరణ్యకు ఫోన్‌ చేయగా, ఆమె స్పందించలేదు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో అదే క్వార్టర్స్‌లో ఉన్న ఆమె స్నేహితురాలు రాజేశ్వరికి సమాచారం అందించాడు ఏలుమలై. దీంతో ఆమె వెళ్లి చూడగా, శరణ్య (21) ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతుండటంతో షాక్‌కు గురైన పోలీసులకు సమాచారం అందించింది.

హటాహుటిన చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అయితే బర్త్‌డేకు ప్రియుడు రాలేదని గుర్తించిన పోలీసులు.. ప్రియుడు రాలేదని కోపంతో ఆత్మహత్య చేసుందా..? లేక ఇతర ఏమైన కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.