'వైఎస్సార్‌ ఆసరా' పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

By సుభాష్  Published on  11 Sep 2020 7:23 AM GMT
వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో పెద్ద హామీని నెరవేర్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం 'వైఎస్సార్‌ ఆసరా' పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన జగర్‌.. ఈ రోజు ప్రారంభించారు. ఈ పథకం నేటి నుంచి అమలు కానుంది. ఈ పథకంలో భాగంగా 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168,83 కోట్లను ప్రభుత్వం నాలుగో విడతల్లో నేరుగా ఆయ సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేశారు.

ఇందులో భాగంగా తొలి ఏడాది రూ.6,792,20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా నేడు జమ చేయనుంది. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని అక్కచెల్లెమ్మలకే వదిలేస్తున్నామని, బ్యాంకర్లు ఆ మొత్తాన్ని పాత అప్పులకు మినహాయించుకోకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story
Share it