సీఎం జగన్‌ పెద్దమామ కన్నుమూత

By సుభాష్  Published on  6 Sep 2020 3:28 AM GMT
సీఎం జగన్‌ పెద్దమామ కన్నుమూత

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దమామ, జగన్‌ సతీమణి భారతి పెద్దనాన్న ఇసీ పెద్ద గంగిరెడ్డి (78) కన్నుమూశారు. ఆయన కొద్ది రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. పులివెందులలోని ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల గొల్లలగూడూరులోని తన ఇంటికి చేరుకున్నారు. ఇక ఆరోగ్యం విషమించడంతో శనివారం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు.

విషయం తెలుసుకున్న సీఎం జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మ, సీఎం సతీమణి వైఎస్‌ భారతి గొల్లలగూడూరుకు చేరుకుని గంగిరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అలాగే పెద్ద గంగిరెడ్డి భార్య సుబ్బమ్మ, కుమార్తె విజయ, కుమారులను పరామర్శించారు. గ్రామ సమీపంలోని సొంత తోట వద్ద ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Next Story
Share it