6నెలలుగా ఆంటీతో ఛాటింగ్‌.. భర్త లేని సమయంలో..

సోషల్‌మీడియాలో పరిచమైన ఓ వివాహితను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చకపోతే.. ఆమె భర్తను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అతడి వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో తట్టుకోలేక ఆ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని కటకటాలోకి నెట్టారు.

చెన్నై నగరానికి చెందిన ఓ మహిళ(37)కు వాటాప్స్‌ ద్వారా కొన్ని రోజుల క్రితం కొళత్తూర్‌కు చెందిన వివేకానందన్‌ అనే యువకుడితో పరిచమైంది. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా ఆరునెలలుగా ఇద్దరు వాటాప్స్‌లో చాటింగ్‌ చేసుకుంటున్నారు. కొన్ని రోజులు బాగానే మాట్లాడిని అతడు.. ఇటీవల వివాహితకు ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. చాటింగ్‌లో అసభ్యఫోటోలు పంపుతూ.. లైంగికంగా వేధిస్తున్నాడు.

దీంతో ఆమె అతడితో చాటింగ్‌ నిలిపివేసింది. దీంతో కక్షగట్టిన ఆ యువకుడు గత వారం ఆమె ఇంటికి వెళ్లి కోరిక తీర్చాలని, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాట్సాప్ ఛాటింగ్ మొత్తాన్ని భర్తకు చూపిస్తానని బెదిరించాడు. ఆమె ఎదురుతిరగడంతో నీ భర్తను చంపేస్తానని హెచ్చరించి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో ఆందోళన చెందిన వివాహిత చైన్నైలోని కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *