నిజామాబాద్‌ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. వావి వరుసలు మరచిన ఓ కామాంధుడు చిన్నాన్న కూతురిపై స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. బోధన్‌లోని బీటీ నగర్‌లో ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. 10వ తరగతి వరకు చదివిన ఆమె స్వల్ప దివ్యాంగురాలు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది. యువతి తల్లిదండ్రులు రోజువారీగా కూలి పనుల వెళ్తుంటారు. దీంతో ఒంటరిగా ఇంటి వద్ద ఉంటున్న యువతిపై పెద్దనాన్న కొడుకు నవీన్ కన్ను పడింది. చెల్లెలిని లోబర్చుకొని అత్యచారం చేయాలని సంకల్పించుకున్నాడు. తనతో పాటుగా స్నేహితుడు రవిని కూడా తోడు తెచ్చుకొని ఇద్దరు కలిసి యువతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయటకి చెప్పొద్దంటూ బెదింపులకు గురి చేశారు.

కాగా కొన్ని రోజుల తర్వాత ఆ యువతి శరీరంలో స్వల్ప మార్పులు మొదలయ్యాయి. యువతి అనారోగ్యానికి గురికావడంతో వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. యువతికి పరీక్షలు చేసిన వైద్యలు ఆమె ప్రస్తుతం ఐదు నెలల గర్భిణీ తెలిపారు. ఈ విషయమై కుల పెద్దలు విషయం బయటకి రానివ్వకుండా రాజీకూర్చే ప్రయత్నం చేశారు. అయితే బాధితురాలి తల్లిదండ్రులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. సమాజం తలదించుకునేలా మహిళలపై అఘయిత్యాలకు పాల్పడుతున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.