ప్రముఖ టాలీవుడ్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీనివాస్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ (80) అనారోగ్యంతో మరణించారు. ఆమె స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకాని. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఈరోజు రాత్రి 7.30 గంటలకు స్వగృహంలో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న బోయపాటి.. హైదరాబాద్‌ నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి పెదకాకానికి బయలుదేరి వెళ్లారు.

ఇదిలా ఉంటే తెలుగు అగ్రదర్శకుల్లో ఒకరైన బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా సినిమా రూపొందిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సింహా, లెజెండ్ వంటి సూపర్‌ హిట్ చిత్రాలు వచ్చాయి. మరోమారు వీరిద్దరు జతకట్టడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.