ఆ, దూరుతాయ్‌.. దూరుతాయ్‌! ఆ మాత్రం మాకూ తెలుసు.. ఆ టైములో ఏం చేయాలో. అవి దూరుతుంటే చూస్తూ ఊరుకుంటానా ఏటి? నేనూ నాలుగు ఆకులు ఎక్కువే చ‌దివా. ఏం ప‌ర్లేదు నా టాలెంట్ నాకుంది. గ్యాప్ వ‌చ్చినా ఇట్టే క‌వ‌ర్ చేసేస్తా. ఎన్‌హెచ్ ఫైవ్‌ రోడ్డుపై బైక్ మాదిరి ర‌య్‌.. ర‌య్‌మంటూ దూసుకెళ్తా. అయినా ఇదంతా నాకు కామ‌నేగా అంటూ సినీ ఇండ‌స్ట్రీలో గ్యాప్ రావ‌డాన్ని ప్ర‌శ్నించిన అభిమానికి ఓ మాస్ హీరోయిన్ ఇచ్చిన స‌మాధానం.

అయినా, నీవ‌న్న‌ట్టు ఇక్క‌డ అవ‌కాశాల‌కు కొద‌వ‌లేదే. ఓప‌క్క‌ కొత్త కొత్త డైరెక్ట‌ర్లు కొత్త కొత్త స్ర్కిప్టుల‌తో ఎంట్రీ ఇస్తున్నారు. మ‌రోప‌క్క తామేంటో నిరూపించుకోవాల‌న్న క‌సితో టాలెంట్ ఉన్న వారిని ఎంక‌రేజ్ చేసేందుకు నిర్మాత‌లు ముందుకు వ‌స్తున్నారు. ఇలా సినీ ఇండ‌స్ట్రీలో ఛాన్స్‌లు వెల్లువెత్తుతుంటే మీరిచ్చిన ఈ గ్యాప్‌లో చాలా మంది హీరోయిన్లు దూరిపోయారంటూ అడ‌గ‌ట‌మూ ఓ ప్ర‌శ్నేనా? నాన్సెస్‌. మాస్ హీరోయిన్ త‌న అభిమానికి ఇచ్చిన కౌంట‌ర్‌ల‌లో ఇది రెండోది.

నిజానికి కొత్త స్ట్ర్కిప్ట్‌ ల‌తో వ‌స్తున్న యంగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్‌లు వారి సినిమాలో ఫ్రెష్ లుక్ కోసం కొత్త వారిని ఎంక‌రేజ్ చేస్తూ మార్కెటింగ్ కోసం పాత వారిని తెగ వాడేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో పాత వారికి గ్యాప్ రావ‌డం స‌హ‌జ‌మే. ఈ గ్యాప్‌ను హీరోలు ఒక‌లా.. హీరోయిన్‌లు మ‌రోలా క‌వ‌ర్ చేసుకుంటున్నారు. వ్యాపారాల‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వారూ.. కెమెరాల ముందు మాట్ హాట్ ఫోజులిస్తూ వీరూ య‌మ బిజీగా సినీ ఇండ‌స్ట్రీలో వారికొచ్చిన గ్యాప్‌ను కాస్త పూడుస్తున్నారు.

మ‌రికొంద‌రేమో ఏక కాలంలో బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే కెమెరాల‌కు హాట్ హాట్ ఫోజులిస్తున్నారు. ఈ కోవ‌లో బాలీవుడ్ నుండి శాండిల్ వుడ్ వ‌ర‌కు ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు ఉండ‌గా, తాజాగా ఆ జాబితాలో మ‌రో బాలీవుడ్ బ్యూటీ వ‌చ్చి చేరింది. విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న భూమి ఫ‌డ్నేక‌ర్ ప్ర‌ముఖ వ్యాపార సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే క్ర‌మంలో ఉత్ప‌త్తుల ప్ర‌చారం నిమిత్తం హాట్ హాట్ ఫోటోల‌కు ఫోజులిచ్చింది. తెల్ల‌టి దుస్తులు ధ‌రించి రిలాక్సింగ్ మూడ్‌లో ఈ సుంద‌రి త‌న అంద చందాలను కెమెరా ముందు ఆర బోసింది. లెట్స్ హావ్ ఏ లుక్‌.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.