అక్కడ రాజకీయాల గురించి మాట్లాడనంటున్న బాలకృష్ణ.. అసలు కారణం ఇదే..!

By సుభాష్  Published on  18 Feb 2020 9:25 AM GMT
అక్కడ రాజకీయాల గురించి మాట్లాడనంటున్న బాలకృష్ణ.. అసలు కారణం ఇదే..!

నందమూరి బాలకృష్ణ.. సినిమాలతో పోలిస్తే రాజకీయాల పరంగా సక్సెస్‌ కాలేకపోతున్నారనే చెప్పాలి. కాకపోతే అప్పుడప్పుడు బాలకృష్ణ మాట్లాడే మాటల్లో కొన్ని అంశాలు రాజకీయ పరంగా హైటెట్‌గా నిలుస్తుంటాయి. బాలకృష్ణ వ్యవహారశైలి కూడా టీడీపీకి, ఆయనకు ఇబ్బందిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజకీయల గురించి సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడుతుంటారు. ఇక తాను చైర్మన్‌గా వ్యవహరిస్తున్న క్యాన్సర్‌ ఆస్పత్రిలో మాత్రం రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

ఇక ఆస్పత్రిలో జరిగే కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనే బాలకృష్ణ.. అక్కడ కొన్ని సార్లు రాజకీయాల గురించి కూడా మాట్లాడిన అంశాలు హైలెట్‌ అవుతుండటంతో.. అక్కడ నిర్వహించిన కార్యక్రమం అసలు ఉద్దేశం నెరవేరడం లేదనే భావన ఆస్పత్రి వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని కూడా కొందరు బాలయ్య దృష్టికి తీసుకెళ్లగా, ఆస్పత్రిలో జరిగే కార్యక్రమాలపై వేరే అంశాలు మాట్లాడబోనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ మీడియా ప్రతినిధులు రాజకీయాల గురించి ప్రస్తావించినా.. బాలయ్య అలాంటి విషయాలు తర్వాత అని కొట్టిపారేస్తున్నారట. మొత్తం మీద ఆస్పత్రిలో ఏదైన కార్యక్రమం జరిగితే రాజకీయాల గురించి మాట్లాడేందుకు బాలయ్య నో చెబుతున్నట్లు తెలుస్తోంది.

Next Story