వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ వ్యక్తి.. తన ప్రియురాలి ఇంటి ముందు నుంచి వెలుతూ.. ఆమెపై చాక్లెట్లు విసిరి.. గాలిలో ముద్దులు పెట్టాడు. ఈ విషయం ఆ మహిళ భర్త గమనించి.. అతనితో ఘర్షణ పడ్డాడు. అదును చూసి అతన్ని హత్య చేశాడు.

వివరాల్లో వెళితే.. నెల్లూరు జిల్లా సంగం మండలం వెంగారెడ్డిపాళెం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి రాఘవ (35) అనే ఆటోడ్రైవర్‌ను నివాసం ఉండేవాడు. అతను 10 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహాం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కాగా రెండు నెలల క్రితం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

సోమవారం ప్రియురాలి ఇంటి మీదుగా ఆటోలో వెళ్తున్న రాఘవ.. ఆమెపై చాక్లెట్ విసిరి గాల్లో ముద్దులు పెట్టాడు. దీనిని మహిళ భర్త గమనించి రాఘవతో ఘర్షణ పడ్డాడు. అదే రోజు రాత్రి మద్యం మత్తులో తరుణవాయి సమీపంలో దువ్వూరు కాలువ బ్రిడ్జిపై నుంచి ఇంటికి వెలుతున్న రాఘవను వెంకటేశ్ తలపై కొట్టి హత్య చేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో రాఘవకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలియడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టి వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. రాఘవను చంపింది తానేనని అంగీకరించడంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.