వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణం తీసుకుని విదేశాలకు పరారైన విజయ్‌ మల్యాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటి మాల్యాకు సంబంధించిన ఆస్తులు స్వాధీనం చేసుకోగా, వాటిని వేలం వేసేందుకు రంగం సిద్దం చేసింది. ఈ మేరకు పీఎంఎల్‌ఏ ముంబై కోర్టు అనుమతులు ఇచ్చింది.రూ.13 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయనుంది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకు కన్సార్షియం మాల్యా ఆస్తులను వేలం వేయనుంది. కాగా, జనవరి 18వ తేదీ తర్వాత మాత్రమే ఆదేశాలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది.  ఇందుకు సంబంధించిన పార్టీలు ఆ ఆదేశాలపై ముంబై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని వివరించింది. జప్తు చేసిన ఆస్తుల లిక్విడేషన్‌కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గత సంవత్సరం ఫిబ్రవరిలో ఈడీ కోర్టకు తెలిపిన విషయం తెలిసిందే. ఇక మనీ లాండరింగ్‌ కేసులోఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా 2016 మార్చి నెలలో లండన్‌కు పరారయ్యాడు. 2017లో అరెస్టు అయిన ప్రస్తుతం బెయిల్‌ మీద ఉన్నాడు. కాగా, విజయ్‌ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు భారత  సర్కార్‌ తీవ్రంగా శ్రమిస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.