ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నీలం సాహ్ని పదవీ కాలన్ని కేంద్ర ప్రభుత్వం పొడిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ఆమె పదవీకాలం ముగియనుండగా.. పదవీకాలాన్నీ మరో 6 నెలలు పొడిగించాలని సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. సీఎస్‌ నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో 3 నెలలు (జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వరకు) పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకుముందు ఏపీ సీఎస్‌గా పనిచేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నీరబ్ కుమార్‌ ప్రసాద్ తాత్కాలికంగా భాద్యతలు అప్పగించారు. ఆ తర్వాత సాహ్ని ఏపీ సీఎస్‌గా పూర్తిస్థాయిలో భాద్యతలు చేపట్టారు. 1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి మహిళా సీఎస్‌.

AP CS gets three months extension

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.