కోరిక తీర్చాల‌ని అత్త ప‌ట్టుబ‌ట్ట‌డంతో..

ప్ర‌స్తుత‌ కాలంలో నేరాలు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. ఈ విష‌యం ఇటీవ‌ల పెరుగుతున్న క్రైమ్‌రేట్‌ను గ‌మ‌నిస్తే ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. వాయివ‌రస‌లు మ‌రిచి ఒక‌డు కామాంధుడి అవ‌తార‌మెత్తితే, ప్రియుడి కోసం క‌ట్టుకున్న భ‌ర్త‌ను, క‌న్న బిడ్డ‌ల‌ను చంపుకునే కామాంధురాలు మ‌రొక‌రు. ఇటువంటి సంఘ‌ట‌న‌లు ప‌దులు.. వంద‌లు కాదు.. వేల సంఖ్య‌లో వెలుగు చూస్తున్నాయి.

తాజాగా, ఆ త‌ర‌హా ఘ‌ట‌నే ఒక‌టి వెలుగు చూసింది. యువ‌కుడిని వ‌ల‌లో వేసుకున్న ఓ మ‌హిళ త‌న కామ కోరిక‌ల‌ను తీర్చుకునేందుకు పావుగా వాడుకుంది. ఆఖ‌ర‌కు ఆ యువ‌కుడికి పెళ్లి అయినా వ‌ద‌ల్లేదు. అత‌న్ని త‌న సొంతం చేసుకునేందుకు వారికి విడాకులు ఇప్పించింది. ఆ త‌రువాత త‌న కుమార్తెనే ఇచ్చి రెండో పెళ్లి చేసి ఏకంగా త‌న ఇంట్లోనే అల్లుడితో కామ కార్య‌క‌లాపాలను కొన‌సాగించింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

అరిపిరాల ర‌విశంక‌ర శ‌ర్మ‌, ఇత‌ని స్వ‌గ్రామం ప్ర‌కాశం జిల్లా త్రిపురాంత‌కం మండ‌ల ప‌రిధిలోగ‌ల కొత్త ముడివేముల గ్రామం. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం కాలేజీ చ‌దువుల కోస‌మ‌ని గుంటూరుకు వెళ్లాడు. అదే సమ‌యంలో ఓ మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం ఏర్ప‌డింది. మ‌హిళ‌ది గుంటూరే కావ‌డంతో ర‌విశంక‌ర‌శ‌ర్మ ప్ర‌తిరోజూ ఆ ఇంటికి రాక‌పోక‌లు కొన‌సాగించేవాడు. ఆ మ‌హిళ సైతం ఇంట్లో త‌న‌వారెవ‌రూ లేని స‌మ‌యంలో ఫోన్‌చేసి మ‌రీ ర‌ప్పించేది.

కుమారుడి అక్ర‌మ సంబంధం గురించి స్నేహితుల ద్వారా తెలుసుకున్న త‌ల్లిదండ్రులు ర‌విశంక‌ర‌శ‌ర్మ‌ను స్వ‌గ్రామానికి పిలిపించి దోర్నాల గ్రామానికి చెందిన యువ‌తిలో వివాహం జ‌రిపించారు. అయినా, ఆ గుంటూరు మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం నెర‌ప‌డాన్ని ర‌విశంక‌ర‌శ‌ర్మ ఆప‌లేదు. కొన‌సాగిస్తూ వ‌చ్చాడు. చివ‌ర‌కు ఆ గుంటూరు మ‌హిళ‌నే వీరి కాపురంలో క‌లుగ‌జేసుకుని ఇద్ద‌రికి విడాకులు ఇప్పించింది.

ఆ త‌రువాత జీవ‌నాధారం కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన ర‌విశంక‌ర శ‌ర్మ బంధువుల ఇంట్లో ఉంటూ పౌరోహిత్య వృత్తి కొన‌సాగించాడు. అప్ప‌టికీ ర‌విశంక‌ర శ‌ర్మ‌ను వ‌ద‌ల‌ని ఆ మ‌హిళ ఏకంగా త‌న ఇంట్లోనే కాపురం పెట్టేందుకు త‌న‌కున్న ఒక్క‌గానొక్క కుమార్తెను అత‌నికి ఇచ్చి రెండో వివాహం చేసింది. ఇలా ఇద్ద‌రు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు.

త‌న త‌ల్లితో భ‌ర్త అక్ర‌మ సంబంధం నెరుపుతుండ‌టాన్ని కూతురు నిశితంగా ప‌రిశీలించింది. భ‌ర్త‌ను నిల‌దీయ‌గా స‌మాధానం చెప్ప‌లేని స్థితిలో ఉండిపోయాడు. దాన్ని అవ‌మానంగా భావించిన ర‌విశంక‌ర‌శ‌ర్మ కురిచేడు రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. మృతుడు ర‌విశంక‌ర్ ష‌ర్టు జేబులోని సూసైడ్ లెట‌ర్ ద్వారా అత‌నిది కొత్త ముడివేముల గ్రామంగా పోలీసులు గుర్తించారు. ర‌విశంక‌ర్ మృతిలో నిజా నిజాలు తెలుసుకున్న కొంద‌రు గుంటూరు వాసులు నీ చేతుల‌తోనే.. నీ కూతురు జీవితం నాశ‌నం చేశావు క‌దే..అంటూ ఆ కామాంధురాలిపై దుమ్మెత్తి పోశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్