ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి భయపెడుతుంటే.. కొందరు మాత్రం తమకు సంబంధం లేదనట్టుగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికి, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న.. తమ కామవాంఛ తీర్చుకునేందుకు మానవమృగాలు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన జరిగింది. ఓ 15 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ముజఫర్‌నగర్‌ పట్టణ పరిసర ప్రాంతాల్లోని ఒక ఊరిలో ఈ ఘటన వెలుగు చూసింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో నుంచి ఎవరూ కూడా బయటకు రావొద్దని ఆ ఊరి పెద్దలు గ్రామస్తులకు సూచించారు. దాంతో ఆ గ్రామ ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఊరిలో జులాయి తిరిగే ఓ యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయాడు. ఒక వేళ బయటకు వెళ్దామంటే పెద్దలకు చెప్పాల్సి ఉంటుందని అనుకుంటూ.. ఇంటి వరండాలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఇంతలోనే ఆ యువకుడి ఇంటివైపుగా ఓ బాలిక రావడాన్ని గమనించాడు. చుట్టూ ప్రజలు ఎవరూ లేకపోవడంతో.. యువకుడి కామవాంఛ బయటపడింది. ఇంట్లో నుంచి ఓ బంతిని రోడ్డుపైకి విసిరేశాడు.

Also Read: డిగ్రీ విద్యార్థినిపై లెక్చరర్‌ లైంగిక దాడి

బాలిక ఆ ఇంటి వద్దకు రాగానే కొంచెం హెలో హెలో కొంచెం బంతి ఇవ్వవా అని అమ్మాయిని అడిగాడు. ఓ చేతిలో ఇంటి సామాను పట్టుకన్న ఆ బాలిక.. రెండో చేతితో బంతిని విసరబోయింది. దీంతో యువకుడు వద్దు అంటూ.. బంతిని చేతికి ఇవ్వూ అంటూ బాలిక వైపు రెండు అడుగులు వేశాడు. బాలిక కూడా అతని వైపు రెండు అడుగులు వేసింది. బాలిక ఇంటి గేటు దాకా రావడంతో.. బాలికను గట్టిగా పట్టుకొని ఇంటి లోపలికి లాక్కెళ్లాడు. మెడపై కత్తి పెట్టి అరిస్తే చంపేస్తానంటూ బెదిరించాడు. తలుపులు వేసి అరగంట తర్వాత బయటకు వచ్చాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తా అంటూ బెదిరించాడు. అతనివైపు భయం భయంగా చూస్తూ బాలిక ఇంటికి పరుగులు పెట్టింది. ఇంటికి వెళ్లి ఏడుస్తూ జరిగిన విషయం తల్లికి చెప్పింది. విషయం తెలుసుకున్న తండ్రి ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొని ఆ యువకుడి ఇంటికి వెళ్లాడు. అయితే ఆ యువకుడు అప్పటికే పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.