12 ఏళ్ల బాలికను అత్యాచారం, హత్య చేసిన 10వ తరగతి విద్యార్థులు

ఏడుగురు పదవ తరగతి విద్యార్థులు పన్నేండెళ్ల బాలికను సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సంఘటన అసోంలోని కలకలం సృష్టించింది.

బిశ్వనాథ్ జిల్లాకు చెందిన ఏడుగురు బాలురు పదవతరగతి పరీక్షలు రాసిన అనంతరం పార్టీ చేసుకుందాం అని చెప్పి బాలికను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అఘాయిత్యం గురించి ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి ఆమెను హత్య చేశారు. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుందని నమ్మించేలా చెట్టుకు ఉరేశారు.

Gohpur police station

కొన్ని గంటలుగా బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు విద్యార్థులపై అనుమానంతో వెతకగా, వారిద్దరూ సమీపంలోని అటవీప్రాంతం నుంచి వస్తూ కనిపించారు. జనాన్ని చూసి పరుగులు తీసారు. అనుమానం తో మరింత ముందుకు వెళ్లిన అడవిలో బాలిక చెట్టుకు వేలాడుతున్న స్థితిలో కంటబడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.