మహాబలిపురంలో 'మహాబలులు'

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2019 3:56 AM GMT
మహాబలిపురంలో మహాబలులు

  • మామల్లపురంలో జిన్‌పింగ్, మోదీ
  • రాతి కట్టడాలను ఆసక్తిగా తిలకించిన పింగ్
  • మామల్లపురం గురించి మోదీని అడిగి తెలుసుకున్న పింగ్
  • 'మహాబలులను' చూడటానికి తరలి వచ్చినే నేతలు, ప్రజానీకం
  • పంచెకట్టుతో దేశ ప్రజలను ఆకర్షించిన మోదీ
  • పూర్తి నిఘా కంటిలో మహాబలిపురం

చెన్నై: దేశ చరిత్రకు, సంస్కృతి, సంప్రదాయాలకు మోదీ ఎంత విలువ ఇస్తారో తెలిసింది. ఆలయాలు, ఆధ్యాత్యిక విషయాలు అంటే ఆయనకు ఎంత అభిమానమో దేశ ప్రజలకు తెలిసి వచ్చే సందర్భమిది. సొంత సంస్కృతికి, సంప్రదాయానికి ఎంతో విలువ ఇచ్చే తమిళ గడ్డపై ఇండియా ప్రధాని, చైనా అధ్యక్షుడు భేటీ అయ్యారు. మహాబలిపురం గురించి మోదీని పింగ్ అడిగి తెలుసుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా మోదీ పంచె కట్టుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.ఇద్దరు నేతలకు తమిళులు ఘనస్వాగతం పలికారు.

Modi Jinping in Mahabalipuram

మహాబలిపురాన్ని జిన్‌ పింగే తన పర్యటనకు వేదికగా చేసుకున్నాడు. వేల ఏళ్ల క్రితమే తమిళనాడులోని మహాబలిపురంతో చైనాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చైనా నాగరికతను, ఆధ్యాత్మికతను ప్రభావితం చేసిన భోధి ధర్మడు మహాబలిపుంర ప్రాంతానికి చెందినవాడే. బోధి ధర్ముడిని చైనా తమ గురువుగా పాటిస్తుంది. అందుకే....పింగ్ ఈ ప్రాంతాన్ని చర్చల కోసం ఎంపిక చేసి ఉండొచ్చు.

Modi Jinping in Mahabalipuram

ట్విటర్‌ లో మోదీ ప్రశంసలు

చెన్నైలో చైనా అధ్యక్షుడికి స్వాగతం పలికిన తీరును మోదీ ట్విటర్‌లో ప్రశంసించారు. చెన్నై చేరుకున్న కాసేపటికే ఆంగ్లం, చైనా, టిబెట్ భాషల్లో ట్విట్ చేశారు. చైనాతో సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సాయంత్రం 5 గంటలకు మోదీ మహాబలిపురం చేరుకున్నారు. తమిళ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా పంచె కట్టారు. మోదీ పంచె కట్టడం తమిళులను ఆనందంలో ముంచెత్తింది. తరువాత..అక్కడ చారిత్రక ప్రదేశాలను మోదీ, పింగ్ సందర్శించారు. ఇద్దరూ నడుస్తూ మాట్లాడుకుంటూ చారిత్రక ప్రదేశాలను తిలకించారు.

Modi Jinping in Mahabalipuram

రెండు దేశాల మీడియాలో హోరెత్తిన పింగ్ పర్యటన

తమిళనాడు మీడియా పింగ్ పర్యటనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పింగ్ దిగినప్పటి నుంచి సాయంత్రం వరకు లైవ్‌లు ఇచ్చారు. చైనా మీడియా కూడా మహాబలిపురం తరలివచ్చారు. సరిహద్దు సమస్యల పరిష్కారానికి, వాణిజ్యాకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఇరు దేశాల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని మోదీ, పింగ్ కోరుకున్నారు.

Modi Jinping in Mahabalipuram

రెండో రోజూ పర్యటన వివరాలు

రెండో రోజు ఉదయం గిండి నుంచి బయలు దేరే జిన్‌ పింగ్‌ 9.50 గంటలకు కోవళం తాజ్‌కు చేరుకుంటారు. అక్కడ 10 గంటల నుంచి 10.50 వరకు ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్‌ల భేటీ ఉంటుంది. అనంతరం 10.50 నుంచి 11.40 వరకు ఇరు దేశాల అధికారుల భేటీ అవుతారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే విందు ఇస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు విమానాశ్రయం చేరుకునే జిన్‌ పింగ్‌ నేపాల్‌కు బయలుదేరి వెళ్తారు.

Next Story