నష్టాల దారిలో థామస్ కుక్!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 6:40 AM GMT
నష్టాల దారిలో థామస్ కుక్!!

178 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్‌ దిగ్గజ సంస్థ థామస్‌ కుక్‌ మూసివేతకు సమీపించింది. ఈ కంపెనీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. పర్యాటక రంగంలో విపరీతమైన పోటీతో ఈ సంస్థ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కార్యకలాపాలు కొనసాగించడానికి 25 కోట్ల డాలర్ల నిధులు అవసరమని థామస్‌ కుక్‌ గత శుక్రవారం వెల్లడించింది. నిధుల కోసం ఈ కంపెనీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రభుత్వం ఆదుకోకపోతే, కంపెనీ మూతపడక తప్పదని సంబంధిత వర్గాలు అంటున్నాయి.

ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్‌ కుక్‌ వెల్లడించింది. బ్రెగ్జిట్‌ అనిశ్చితి కారణంగా సమ్మర్‌ హాలిడే బుకింగ్స్‌ ఆలస్యం కావడంతో నష్టాలు పెరిగాయి.

ఫలితంగా ఈ కంపెనీ ద్వారా వివిధ దేశాల్లో పర్యటిస్తున్న లక్షన్నర మంది బ్రిటిష్‌ పర్యాటకులు ఇబ్బందులు పడనుండగా, వేలాదిమంది ఉద్యోగులు వీధినపడే అవకాశాలున్నాయి.

Next Story