కీలక నిర్ణయం: ఏపీలో ఏసీ బస్సులను అనుమతి

By సుభాష్  Published on  2 Jun 2020 6:24 AM GMT
కీలక నిర్ణయం: ఏపీలో ఏసీ బస్సులను అనుమతి

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య తీవ్రంగా ఉంది. ఇక కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ 5.0 కొనసాగుతోంది. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. దీనిలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విజయవాడ నుంచి విశాఖకు ఇంద్ర ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించింది. డిమాండ్‌ను దృష్టి లో ఉంచుకుని ఏసీ బస్సులను విశాఖ సహా తిరుపతి, కడప, కర్నూలు ప్రాఇంతాలకు నడపాలని నిర్ణయించింది. మరో వైపు లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో బస్సు సర్వీసులను రోజురోజుకు పెంచేందుకు ఆలోచిస్తోంది.

కృష్ణా జిల్లా రీజియన్‌ నుంచి రెండు,మూడు రోజుల కిందట దాదాపు 200 బస్సులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడపగా, సోమవారం నుంచి వీటి సంఖ్య 308కి పెంచింది. వీటిలో పల్లెవెలుగు బస్సులకు ఆదరణ లేకపోయినా దూర ప్రాంతాలకు మాత్రం బాగానే డిమాండ్‌ పెరిగింది. అయితే వీటిలో డిమాండ్‌ అధికంగా ఉన్న విశాఖ, రాజమండ్రి రూట్లకు ఎక్కువగా నడుపుతోంది.

ఉదయం 5 నుంచి రాత్రి గంటల వరకూ..

ఆర్టీసీ బస్సు సర్వీసులకు అనుమతి ఇచ్చాక ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నడిచాయి. తాజా నిర్ణయంతో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడుపుతున్నారు. ఇక భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశంతో బస్సుల్లో సీట్లను కుదించినా.. ఇందులో సగం మంది వరకైనా ప్రయాణించడం లేదు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్యను బట్టి మరిన్ని బస్సులను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

Next Story