టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్… ఎక్కడైనా ప్ర‌స్తుతం బ‌యోపిక్ ట్రెండ్ న‌డుస్తోంది. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ బ‌యోపిక్ ది యాక్సిడెంట్ ప్రైమ్ మినిష్ట‌ర్, ష‌కీలా బ‌యోపిక్, మోడీ పై సినిమా, క్రికెట‌ర్ థోని బ‌యోపిక్… ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ జీవిత క‌థ‌, సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ సంజు, సిల్క్ స్మిత బ‌యోపిక్ థ‌ర్టీ పిక్చ‌ర్.. ఇలా బాలీవుడ్ లో చాలా బ‌యోపిక్ లు వ‌చ్చాయి. మ‌రికొన్ని వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాయి.

టాలీవుడ్ లో ఇటీవ‌ల ఎన్టీఆర్ బ‌యోపిక్, మ‌హాన‌టి బ‌యోపిక్, వంగవీటి బ‌యోపిక్, తాజాగా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ‌… ఇలా ఎన్నో బ‌యోపిక్ లు వ‌చ్చాయి. ఇక కోలీవుడ్ లో ఎమ్జీఆర్, క‌రుణానిథి బ‌యోపిక్ వ‌చ్చింది. జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇలా.. ఏ వుడ్ అయినా బ‌యోపిక్ అనేది కామ‌న్ అన్న‌ట్టు ఉంది ప్ర‌జెంట్. అయితే…త్వరలో ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వ‌ల్ బ‌యోపిక్ రానుంది. గ‌త కొన్ని రోజులుగా సైనా బయోపిక్‌పై బాలీవుడ్‌లో వార్తలు సందడి చేస్తున్నాయి.

ఈ సినిమాకి అమోల్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సైనా పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌ఫూర్ ని ఎంపిక చేశారు. ఆమె కొంత కాలం పాటు బ్యాడ్మింట‌న్ లో శిక్ష‌ణ కూడా తీసుకున్నారు. అయితే… ఏమైందో ఏమో కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నారు. అది బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఆ త‌ర్వాత సైనా పాత్ర చేయ‌డానికి పరిణితి చోప్రా ముందుకు వ‌చ్చింది.

ఈ పాత్ర చేసే అవ‌కాశం రావ‌డం త‌న అదృష్టం అని చెబుతుంది ప‌రిణితి చోప్రా. సైనా పాత్ర‌లో మెప్పించేందుకు చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాన‌ని.. ఖ‌చ్చితంగా ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆమె చెప్పింది. వ‌చ్చే సంవ‌త్స‌రం ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి… సైనా పాత్ర‌లో ప‌రిణితి చోప్రా ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో చూడాలి.

అయితే..గురు గోపీచంద్‌తో గొడవలు..హైదరాబాద్‌ వదిలి బెంగాళూరు వెళ్లడం..మళ్లీ గురు గోపీచంద్‌ను కలవడం ఇవన్నీ ఈ బయోపికల్‌లో ఉంటాయో లేదో చూడాలి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.