విజయవాడ: వెలిగొండ పనుల టెండరింగ్‌లో రియాలిటీ షో జరుగుతోందని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ నాలుగు నెలల పాలన గురించి జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు. ఈ నాలుగు నెలల్లో ఎవరెవరికి పెండింగ్ బిల్లులు చెల్లించారో చెప్పగలరా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పనులు హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాయన్నారు. గోదావరి గర్భం లో 300 అడుగుల లోతులో కొండరాయిని పట్టుకుని డయాఫ్రమ్ వాల్ కట్టాము. కానీ జగన్‌ ఢిల్లీ పర్యటన చేయటమే సరిపోతుందని విమర్శించారు.

ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో మీడియా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం సీఎం కి లేదన్నారు. రైతు భరోసా పథకం కింద వచ్చే డబ్బులు రైతుల అకౌంట్ లో జమ కావటం లేదు. డబ్బులు పడనప్పుడు మళ్ళీ మెసేజ్ లు ఎందుకు.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.