వాహనం పాడైతే మాకు ఫోన్ చేయండి: రాచకొండ పోలీసు కమిషనర్
By Newsmeter.Network Published on 29 Nov 2019 7:01 PM IST
రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు, ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి నేరాలను అరికట్టేందుకు రాచకొండ పోలీసులు ముందుకొచ్చారు. ఎవరికైన ఏదైన సమస్య వచ్చినట్లయితే తమ నంబర్లకు కాల్ చేయాలని సూచిస్తున్నారు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. వాహనాలపై వెళ్లేటప్పుడు బైక్ పంక్చర్ లాంటి సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసుల సహాయం తీసుకోవాలని ఆయన సూచించారు.
ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి వాహనాన్ని మరమ్మతులు చేయించడం లేదా గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చడంలో తోడ్పాటు అందిస్తారన్నారు. ఈ మేరకు పోలీసు కంట్రోల్ రూం నెం. 100 కాల్ చేసి సమాచారం ఇవ్వానలి సూచించారు. అలాగే 9490617111 వాట్సాప్ నెంబర్‌కి లొకేష్ కూడా షేర్ చేయవచ్చని తెలిపారు. తాజాగా షాద్‌నగర్‌లో జరిగిన వెటర్నరీ వైద్యురాలు హత్య కేసుతో పాటు నగర శివారులో హత్యోదందాలు పెరిగిపోతున్న నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనర్ ఈ సూచనలు చేశారు.