మళ్లీ అదే పాత పాట…!

హైదరాబాద్ : మళ్లీ అదే పాత పాట పాడింది.ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించలేమని ప్రభుత్వం మరోసారి హైకోర్ట్‌కు తెలిపింది. ఆర్టీసీ కార్పొరేషన్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని చెప్పింది. ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి బాగోలేదని స్పష్టం చేసింది. కార్మికుల ఆర్ధికపరమైన డిమాండ్లు నేరవేర్చలేమని ప్రభుత్వం మరోసారి హైకోర్ట్‌ కు తెలిపింది. సమ్మె కారణంగా ఇప్పటి వరకు ఆర్టీసీ 44 శాతం నష్టపోయిందని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేమని కుంబబద్దలు కొట్టింది. యూనియన్‌ నేతలు విలీన డిమాండ్ ను తాత్కాలికంగా పక్కన పెట్టినా..ఏదో ఒక సమయంలో దానిని రేజ్ చేసే అవకాశముందని ప్రభుత్వం కోర్ఠ్‌కు తెలిపింది. కొంత మంది యూనియన్ నేతలు తమ స్వార్ధం కోసం టీఎస్‌ఆర్టీసీని నష్టాల్లోకి నెడుతున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టేందుకు యూనియన్ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. సమ్మెను కార్మికుల కోసం కాకుండా యూనియన్ నేతలు తమ ఉనికి కోసం చేస్తున్నారని ప్రభుత్వం వాదించింది. సమ్మెను ఇల్లీగల్‌గా ప్రకటించాలని కోర్ట్‌ను కోరింది. మళ్లీ అదే పాత పాట పాడింది తెలంగాణ ప్రభుత్వం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.