బన్నీ ఆర్ట్స్‌ ముందు ఆందోళనకు దిగిన నటి సంగీత..!

హైదరాబాద్: బన్నీ ఆర్ట్స్ ముందు మరోసారి ధర్నాకు దిగారు సంగీత. గతంలో ఫిలిం ఛాంబర్స్ గేట్‌కు తన చేతులు గొలుసుతో కట్టేసుకుని తెల్లవార్లు ఆందోళన చేశారు. ఎన్నికల సమయంలో జనసేనకు పూర్తి మద్దతుగా ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే సినిమాల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికలయ్యాక బన్నీ ఆర్ట్స్ తనను పట్టించుకోలేదని ఆరోపించారు. సినిమాల్లో అవకాశం ఇవ్వకుండా మోసం చేశారు ఆవేదన వ్యక్తం చేశారు సంగీత.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్