జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని ఫైర్‌ అయ్యారు. పవన్ నాయుడుగా సంబోధిస్తూ... ఆయనను మేము రాజకీయ నాయకుడిగా గుర్తించటం లేదని అన్నారు. పవన్ డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయని, సినిమాల్లో కట్ షూట్ రెండు ఉంటాయని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పరిపక్వత ఉండాలి....నీకు రెమ్యూనరేషన్ ఇచ్చి కాల్ షీట్స్ ఇచ్చిన ప్రభుత్వాన్ని పొగుడుతున్నావని మండిపడ్డారు. పవన్ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. పవన్ చిరంజీవి పేరు చెప్పడంతోనే ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక పెళ్లి చేసుకోకుండా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, మహిళలంటే పవన్‌ కల్యాణ్‌కు విలువలు లేవని, పవిత్ర స్త్రీ జాతిని అవమానిస్తున్నాడని మంత్రి మండిపడ్డారు.

Newsmeter.Network

Next Story