డైపర్‌ మారుస్తా ట్రైనింగ్ ఇవ్వు..సచిన్‌కు రహానే చురకలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 1:59 PM GMT
డైపర్‌ మారుస్తా ట్రైనింగ్ ఇవ్వు..సచిన్‌కు రహానే చురకలు..!

టీమిండియా ఆటగాడు రహానే తన కుమార్తె మొదటి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రహానే భార్య రాధిక గత శనివారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయానికి రహానే విశాఖలో దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఉన్నాడు. టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత కుమార్తెను చూసిన రహానే ఒక ఫోటో ని పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. రహానే పోస్ట్ పై స్పందించిన సచిన్ టెండుల్కర్ అతనికి అభినందనలు తెలిపారు. మొదటి బిడ్డ వల్ల కలిగే ఆనందాన్ని దేనితోనూ సరిపోల్చలేమన్నాడు సచిన్. అంతేకాదు... ఇకపై డైపర్లు మారుస్తూ, నైట్ వాచ్ మెన్ గా కొత్త జాబులో ఎంజాయ్ చేయమని ట్వీట్ చేశాడు సచిన్ . దీనిపై వెంటనే స్పందించిన రహానే త్వరలో కొన్ని టిప్స్ కోసం మిమ్మల్ని కలుస్తాను పాజి అని జవాబిచ్చాడు. సచిన్‌తో పాటు ఫరాన్ అక్తర్, తదితరులు తమ విషెస్ తెలియజేశారు. రహానే తండ్రి అయిన విషయాన్ని మొదటిగా హర్భజన్ సింగ్ అభిమానులతో పంచుకున్నాడు. నీ లైఫ్ లో ఫన్ ఇప్పుడే మొదలైంది అంటూ ట్వీట్ చేశాడు. కుటుంబానికి కొత్త వ్యక్తి రాకతో రహానే దంపతులు ఎంతో ఆనందంగా ఉన్నారు.

Image

Next Story
Share it