జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్‌కు ఇంకా ఒక నెల మాత్రమే ఉంది.!

By అంజి  Published on  9 Dec 2019 6:58 AM GMT
జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్‌కు ఇంకా ఒక నెల మాత్రమే ఉంది.!

లక్షలాది మంది విద్యార్థుల జీవన దశను, దిశను నిర్ధారించే అత్యంత కీలక పరీక్ష జే ఈ ఈ మెయిన్స్ 2020 కి ఇంకా కేవలం ఒక్క నెల మాత్రమే ఉంది. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌టీఐలతో సహా దేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు జేఈఈ మెయిన్స్ పరీక్షే కీలకం. ఈ ఎంట్రన్స్ టెస్ట్ జనవరిలో జరుగుతుంది.

ఈ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే డిసెంబర్ 6 ప్రిలిమ్స్ ను నిర్వహించింది. ఇప్పుడు జనవరి 6, 11 తేదీల్లో మెయిన్స్ నిర్వహించబోతోంది. రెండవ జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 3, 6 తేదీల్లో నిర్వహించబోతోంది.

ఈ పరీక్ష కోసం చాలా తీవ్రమైన పోటీ ఉంటుంది కాబట్టి దీనికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ తమ తమ వ్యూహాలకు పదును పెట్టుకోవడం తో పాటు దానిని అమలు చేసే విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏడాదిలో రెండు సార్లు – అంటే జనవరి, ఏప్రిల్ లలో జేఈఈ మెయిన్స్ ను నిర్వహిస్తుంది. వీటి ద్వారా 31 ఎన్ ఐటీ లకు, 25 ట్రిపుల్ ఐటీలకు, 28 జీ ఎఫ్ టీ ఐలకు ఎడ్మిషన్లు పొందవచచు. అందుకే అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఇది అత్యంత కీలక పరీక్షగా నిలిచింది.

ఇప్పుడు మీ తయారీ లో మార్పులు చేసే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే ఇప్పుడు మీరు మీ వ్యూహానికి కేవలం తుది మెరుగులు మాత్రమే పెట్టగలరు. ఇది మీ మనసును సరైన స్థితిలో ఉంచుకోవాల్సిన సమయం. ఈ దశలో మీ పట్ల విశ్వాసం ఉండటం చాలా అవసరం.

ఎగ్జామ్ గురు చెప్పేదేమిటంటే మీ పరీక్షల ఎడ్యూలు, టైమింగ్స్, మీ సెంటర్ ల వివరాలను గోడకు అతికించుకోవాలి. సిలబస్ లో ఏయే అంశాలున్నాయో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పనిని మీలో చాలా మంది ఇప్పటికే ఖచ్చితంగా చేసేసి ఉంటారు. ఈ నెల పాటు దొరికిన టైమ్ ను వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్టులలో పాల్గొనడం అవసరం. ఎందుకంటే తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్టు మీకు పరీక్ష వాతావరణం అలవాటైపోతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో ముఖ్యమైన కాన్సెప్టు లకు, ఫార్ములాలపై బాగా దృష్టి పెట్టాలి.

గతేడాది అంతకు ముందరి సంవత్సరాల ప్రశ్న పత్రాలను చూసుకొండి. దీనిని బట్టి మీకు సబ్జెక్టుల వెయిటేజ్ అర్థమైతుంది. ఎక్కువ మార్కులు వచ్చే ప్రశ్నలపై దృష్టి కేంద్రీకరించడానికి దీని వల్ల మీకు వీలవుతుంది. ఈ పని పూర్తయ్యాక మీ రివిజన్ ప్లాన్ లో మార్పులు చేసుకుని, ఎక్కువ మార్కులు వచ్చే విషయాలపై ఫోకస్ చేయండి. ఆ తరువాత మాక్ టెస్టులలో పాల్గొనండి. ఇందుకు గాను పలు వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అధికారిక వెబ్ సైట్ https://jeemain.nta.nic.inను కూడా చూడవచ్చు. జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలు జనవరి 31 నాటికి వెలువడతాయి.

ఆల్ ది బెస్ట్!!!

Next Story
Share it