'జూలీ'ది జాలి లేని గుండె..! ఈ కేసు పోలీసులకు ఓ సవాల్..! -డీజీపీ కీలక వ్యాఖ్యలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2019 5:31 PM GMT
జూలీది జాలి లేని గుండె..! ఈ కేసు పోలీసులకు ఓ సవాల్..! -డీజీపీ కీలక వ్యాఖ్యలు

ఆస్థి ఎంత పని చేసింది. ఆస్థి ఎంత పనైనా చేయిస్తది అని చెప్పడానికి జూలీనే ఓ ఉదాహరణ. ఆస్థి కోసం ఆమె ఆరుగురు కుటుంబ సభ్యులను చంపింది. ఆ చంపిన వారిలో ఆమె భర్త కూడా ఉన్నాడు. 17 ఏళ్ల క్రితం ఫస్ట్ మర్డర్‌ చేసిన జూలీ..మూడేళ్ల క్రితం చివరిసారి సైనేడ్ ప్రయోగించింది. ఈ కేసును విచారిస్తున్న కేరళ పోలీసులకు మతి పోతుంది.

Image result for kerala killer jolly

Image result for kerala killer jolly

చంపడం ఇంత ఈజీనా అనుకుంటున్నారు. అది కూడా చట్టానికి దొరక్కుండా . ఓ మహిళ ఇంతటి అగాయిత్యానికి ఎందుకు పాల్పడిందని ఆరా తీస్తే..ఆస్థి కోసం..కుటుంబ సభ్యులనే చంపింది. 14 ఏళ్లలో ఆరుగురిని చంపేసింది. అది కూడా ఎవరికి అనుమానం రాకుండా సైనేడ్‌తో చంపేసింది. ఈ కేసుపై ఆ రాష్ట్ర డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు .

Image result for kerala killer jolly

ఈ కేసు విచారణ సవాళ్లతో కూడుకున్నదన్నారు. కేసును సమగ్రంగా విచారించడానికి ఆరు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూలీ మొదటి భర్తను చంపిన కేసులో ఆమెతోపాటు మరో ఇద్దరు రిమాండ్ లో ఉన్నారు. జూలీ రెండో భర్త కూడా పోలీసుల అదుపలో ఉన్నాడు. ఈ హత్యలపై ఐదు కేసులు నమోదు చేసినట్లు డీజీపీ చెప్పారు.

Image result for kerala killer jolly

Image result for kerala killer jolly

మోజోకు అనుమానం ఎలా వచ్చింది..?

తన భర్త రాయ్‌ థామస్‌ 2008 ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు జూలీ అల్లిన కథను అందరూ నమ్మారు. ఇక్కడే స్కెచ్ తిరగబడింది. రాయ్ థామస్ మానసికంగా ఎంతో ధృడంగా ఉంటాడు. ఈ విషయంలో తన సోదరుడు మోజోకు బాగా తెలుసు. తన అన్నయ్య ఆత్మహత్య చేసుకోడని బలంగా నమ్మాడు మోజో. దీంతో మోజోకు అనుమానం వచ్చింది. ఆస్తి బదలాయింపు విషయంలో జూలీ అక్రమాలకు పాల్పడింది. దీంతో అతని అనుమానం మరింత బలపడింది. మోజో ఫిర్యాదు మేరకు కేరళ క్రైం బ్యాంచ్‌ దర్యాప్తు ప్రారంభించింది.

Image result for kerala killer jolly వారి విచారణ చేసే కొద్ది నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. రాయ్ థామస్ సైనేడ్ ప్రయోగంతోనే చనిపోయినట్లు ఆధారాలు లభించాయి. మిగతా ఐదుగురు కూడా సైనేడ్ ప్రయోగంతోనే చనిపోయినట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో క్రైం బ్యాంచ్‌కు మైండ్ పోయింది. జూలీని విచారించే కొద్దీ నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. కేసులో ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు . ఆ తరువాతే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశముంది.

Image result for kerala killer jolly

Next Story
Share it