జీహెచ్ఎంసీ: ఆన్‌లైన్‌లో జరిమానా నోటీసులు పంపించబోతోంది.

జీహెచ్ఎంసీ – రోడ్డు మీద చెత్త పారేస్తున్నారా? పార్కుల్ని, గోడల్ని ఖరాబు చేసేస్తున్నారా? లేక అర్జెంటని చేయాల్సిన పనిని బహిరంగ ప్రదేశంలోని కానిచ్చచేసి “హమ్మయ్య” అనుకుంటున్నారా? జాగ్రత్త బాబూ జాగ్రత్త!! ఇకపై మన జీహెచ్ఎంసీ ఇలాంటి వారి పని పట్టేయబోతోంది. మన ట్రాఫిక్ పోలీసుల్లా ఆన్ లైన్లో జరిమానా నోటీసులు పంపించబోతోంది. అంతే కాదు. నెల రోజుల్లో జరిమానా చెల్లించకపోతే అంతే సంగతులు. సో… ఇకపై ట్రాఫిక్ చలాన్లను చూడటం తో పాటు మీ పారిశుధ్య పాపాల చిట్టాను కూడా చూసుకుంటూ ఉండాలి మరి!

ఇలా ఆన్ లైన్లో జరిమానాలు విధించి మిమ్మల్ని లైన్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న మొట్టమొదటి మహానగరం మన హైదరాబాదే. జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్ మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం వారు ఇకపై ఈ బాధ్యతను తమ తలకెత్తుకున్నారు. సీఈసీ అనే సాప్ట్‌వేర్ ను రూపొందించి పారిశుధ్యాన్ని దెబ్బతీసే వారిని ట్రాక్ చేసి మరీ చాలాన్లు జారీ చేయబోతున్నారు. ఈ చాలాన్లకు క్యుఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఇప్పటికే ఒక నెల రోజులుగా ఈ సాఫ్ట్‌వేర్ ను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. అక్టోబర్ 10 న పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించారు.

ప్రస్తుతం ఇది జీహెచ్ఎంసీ ఉద్యోగులకే పరిమితం. కానీ డిసెంబర్ నెలలో జీహెచ్ఎంసీ లోని ఆరు జోన్లకు ఇది విస్తరించబోతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇది పూర్తి స్థాయిలో అమలవుతుంది. ఈ విషయాన్ని మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్ మెంట్ అండ్ డిజిస్టర్ మేనేజ్ మెంట్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపటిలు తెలియచేశారు.

ఉదాహరణకు ఒక కాంట్రాక్టర్ చెత్తను తీయలేదనుకొండి. ఈవీడీఎం బృందాలు దాన్ని ఫోటో తీసి, సాఫ్ట్ వేర్ లో లోడ్ చేస్తారు. ఈ సాఫ్ట్ వేర్ ఈ చాలాన్ ను జారీ చేస్తుంది. నెల రోజుల్లో జరిమానా చెల్లించకపోతే నోటిఫికేషన్ జారీ చేస్తారట. ఇప్పటికే ఈ విభాగానికి చెందిన 20 బృందాలు 1084 ఈ చాలాన్లను జారీ చేశారు.

అంటే సగటున రోజుకు 30 నుంచి 35 చాలాన్లు జారీ చేస్తున్నారన్న మాట. చెత్త వేస్తే వంద రూపాయలు, డ్రెయినేజ్ లో చెత్త వేస్తే వెయ్యి రూపాయలు, తమ దుకాణాల ముందు వ్యాపారులు చెత్తే వేస్తే రెండు వేల రూపాయలు, రోడ్లపై పెద్ద మొత్తంలో చెత్త వేస్తే రెండు వేల రూపాయల జరిమానా విధిస్తారు. అంతే కాదు. ప్రమాదకరమైన చెత్తను వాహనాల్లో తలిస్తే పాతిక వేల రూపాయల జరిమానా విధిస్తారు.

ఇదే తప్పు రెండో సారి చేస్తే రూ. 50000 జరిమానా ఉంటుంది. ఇవే కాక ఇష్టారాజ్యంగా బ్యానర్లు, కటౌట్లు పెడితే రూ. 5000 జరిమానా పడుతుంది. దాదాపు కోటిన్నర రూపాయల మేరకు జరిమానా విధించారట. దాదాపు ఇరవై శాతం మంది జరిమానాలు చెల్లించారట కూడా.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort