జియో కీలక నిర్ణయం: ఇతర నెట్ వర్క్‌లకు కాల్ చేస్తే ఛార్జి..!

ముంబై: జియో కీలక నిర్ణయం తీసుకుంది. జియో నెట్ వర్క్‌ నుంచి ఇతర నెట్‌ వర్క్‌లకు కాల్ చేస్తే చార్జీలు వాసి పోతాయి. నిమిషానికి ఆరు నిమిషాల చొప్పున వసూలు చేయనున్నట్లు జియో ప్రకటించింది. అయితే..చెడ్డ వార్తలో కూడా మంచిని మోసుకొచ్చింది. వినియోగదారులు చెల్లించిన మొత్తానికి బదులుగా డేటా ఇస్తామని ప్రకటించింది. ఐయూసీ ఛార్జీల విషయంలో ట్రాయ్‌ నిబంధనలు పాటిస్తామని ప్రకటించింది. జియో టు జియోకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఇన్‌కమింగ్ కాల్స్‌, ల్యాండ్ లైన్ల విషయంలో డబ్బులు వసూలు చేయరు. అక్టోబర్ 10 తరువాత రీ ఛార్జ్ చేసుకునే వారిని ఈ చార్జీలు వర్తిస్తాయి.

కాల్స్ ఛార్జీల విషయంలో జియోపై ట్రాయ్‌ ఒత్తిడి పని చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు జియో వినియోగదారులు కాల్స్‌కు ఎలాంటి చార్జీలు చెల్లించడంలేదు. కేవలం..డేటాకు మాత్రమే చెల్లిస్తున్నారు. వసూలు చేసిన మొత్తాన్ని డేటా రూపంలో ఇవ్వడానికి టాపప్ ఓచర్లు తీసుకొచ్చింది. దీని వలన వినియోదారులకు ఆర్ధికంగా నష్టం ఉండదని జియో ఓ ప్రకటనలో పేర్కొంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్