క్రైం న్యూస్‌ | ఆ రాక్షసుడి శిక్షను తగ్గించిన హైకోర్టు...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Nov 2019 7:36 AM GMT
క్రైం న్యూస్‌ | ఆ  రాక్షసుడి శిక్షను తగ్గించిన హైకోర్టు...!

ముఖ్యాంశాలు(క్రైం న్యూస్‌)

  • వరంగల్‌ చిన్నారి లైంగికదాడి, అత్యాచారం కేసు
  • నిందితుడు ప్రవీణ్‌ను చచ్చేదాకా జైల్లోనే ఉంచాలి: హైకోర్టు
  • ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు

క్రైం న్యూస్‌ - వరంగల్‌: హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన మానవమృగం ప్రవీణ్‌కు హైకోర్టు శిక్షను తగ్గించింది. నిందితుడు ప్రవీణ్‌ అలియాస్‌ పవన్‌కు వరంగల్‌ కోర్టు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారగార శిక్షగా మారుస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలురించింది. నిందితుడు ప్రవీణ్‌ను తుదిశ్వాస వరకు జైల్లోనే ఉంచాలని హైకోర్టు సృష్టం చేసింది. వరంగల్‌ కోర్టు అభ్యర్థనతో పాటు, నిందితుడు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారించిన చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

జూన్‌ 6 వ తేదీన హన్మకొండలోని కూమర్‌పల్లిలో తెల్లవారుజామున ఓ ఇంటి మేడపైకి ఎక్కి నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని నిందితుడు పోలెపాక ప్రవీణ్‌ అలియాస్‌ పవన్‌ (25)అపహరించాడు. అనంతరం మద్యం మత్తులో చిన్నారిపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన విషయం తెలిసిందే. చిన్నారి హత్య ఘటనపై 51 రోజుల్లో విచారణ పూర్తి చేసిన వరంగల్‌ కోర్టు ఆగస్టు 7వ తేదీన ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. 9 నెలల పసిమొగ్గపై అత్యాచారం చేసిన ప్రవీన్‌ను వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉంచారు. గతంలో నిందితుడు ప్రవీణ్‌ తరఫున వాదించటానికి ముందకు రాకూడదని న్యాయవాదులు బార్‌ కౌన్సిల్‌ తీర్మానం చేశారు.

Pravaeen

కాగా హైకోర్టు తీర్పులో భాగంగా ఉరిశిక్షకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చలను ధర్మాసనం ప్రస్తావించింది. కొన్ని దేశాల్లో నేరాల రేటుతో ఎక్కువగా ఉన్న ఉరిశిక్షను విధించడం లేదని హైకోర్టు తెలిపింది. ఉరిశిక్షలతో నేరాలను తగ్గించాలనుకోవడం సరికాదని హైకోర్టు తన అభిప్రాయాన్ని తెలిపింది. చిన్నారిని కోల్పోయిన నష్టం తల్లిదండ్రులకు తీర్చలేనిదని హైకోర్టు వ్యాఖ్యనించింది. సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో వెలువరించిన మార్గదర్శకాలను హైకోర్టు వ్యాఖ్యనించింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌ అలియాస్‌ పవన్‌కు కిందిస్థాయి కోర్టు విధించిన ఉరిశిక్షను తగ్గిస్తూ యావజ్జీవ కారగార శిక్ష విధించింది. నిందితుడు వెనుకబడిన తరగతికి చెందిన 25 ఏళ్ల యువకుడని, దొంగతనం తప్ప మరే ఇతర తీవ్ర నేరాలు చేసినట్టుగా ఆధారాలు లేవని తెలిపింది.

ఇది కూడా చదవండి: ఆరేళ్ల బాలికపై 13 ఏళ్ళ బాలుడు లైంగిక దాడి..

Next Story
Share it