క్రైం న్యూస్‌

కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నంద్యాల ఎన్జీవోస్‌ కాలనీలో చంద్రశేఖర్‌ రెడ్డి అనే కేబుల్‌ ఆపరేటర్‌పై దుండగులు కత్తితో దాడి చేశారు. కేబుల్‌ కనెక్షన్‌ వ్యాలిడిటీ అయిపోయింది రీచార్జ్‌ చేసుకోమని చెప్పినందుకు చంద్రశేఖర్‌రెడ్డిపై దుర్భషలాడుతూ దుండుగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. బీట్‌ కానిస్టేబుల్‌ చూస్తుండగా కత్తితో దాడి చేయడం దారుణ బాధితుడు చంద్రశేఖర్‌ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. కత్తితో దాడి చేయడంతో చంద్రశేఖర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.