క్రైం న్యూస్‌-జగిత్యాల జిల్లా

క్రైం న్యూస్‌-జగిత్యాల: జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమకు వివాహనికి పెద్దలు అడ్డుపడతారేమోనన్న భయంతో ప్రేమ జంట మనస్తాపం చెంది ఊరేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కథలాపూర్‌ మండలం రాజారామ్‌ తండాకు చెందిన భూక్య శిరీష, లకావత్‌ మహిపాల్‌ డిగ్రీ కలిసి చదువుకుంటున్నారు. ఈ క్రమంలో స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల శిరీషకు మానాలకు చెందిన యువకుడితో తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు.

వేరే యువకుడితో పెళ్లి ఇష్టం లేని శిరీష.. ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. శనివారం రోజున ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన జంట.. గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనతో రాజారామ్‌ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ బిడ్డలను కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.