కోర్టులో లోంగిపోయిన కోడెల శివరామ్..!

By Newsmeter.Network  Published on  9 Oct 2019 2:44 PM IST
కోర్టులో లోంగిపోయిన కోడెల శివరామ్..!

అమరావతి: దివంగత మాజీ స్పీకర్ కోడెల తనయుడు కోడెల శివరామ్‌ మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంలో.. క్రైమ్ నెంబర్ 264, IPCసెక్షన్ 409,411 కింద తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తెలిసిందే. ఇక దీనిపై హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు లొంగిపోవాలని సూచించారు.నేడు ఉదయం కోర్టులో హాజరైన శివరామ్‌కు రూ.20 వేలు పూచీకత్తు తో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని ఆదేశించారు.

'కె టాక్స్'కు సంబంధించి పలువురు బాధితులు కోడెల శివరామ్ పై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.

Next Story