* స్వలింగ సంపర్కులకు మరణశిక్ష

* బిల్ పై పునరాలోచనలో అధ్యక్షుడు

* ఎల్‌జిబిటిల హక్కులపై హ్యూమన్ రైట్స్ ఆందోళన

గేలకు మరణ శాసనాన్ని లిఖించే దిశగా ఉగండా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో స్వలింగ సంపర్క వ్యతిరేక బిల్లుపై మరోసారి చర్చకు తెరలేసింది. అధ్యక్షుడు యోవేరి ముసెవెని గురువారం బిల్లుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఉగాండా ప్రజల్లో దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

అధ్యక్షుడు యోవేరి ముసెవెని ఫిబ్రవరి 14 ,2014లో స్వలింగ సంపర్కానికి వ్యతిరేక బిల్లును కఠినమైన చట్టం చేస్తూ సంతకం చేశారు. ఈ చట్టంపై వారాల తరబడి వాడివేడిగా చర్చ జరిగిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం ప్రకారం మొదటిసారి స్వలింగ సంపర్కానికి పాల్పడితే 14 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. మైనర్లు, వికలాంగులు, హెచ్ఐవీ రోగులు స్వలింగ సంపర్కానికి పాల్పడితే ను జీవిత ఖైదు విధించేలా చట్టం చేశారు.

అయితే బిల్లు ఆమోదించినట్లయితే ఉగండాకు ఆర్థిక సాయం నిలిపివేస్తామని పాశ్చత్య దేశాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే..ఆఫ్రికన్లు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించరని ఉగండా అధ్యక్షుడు ప్రకటించారు. ఉగండా అధ్యక్షుడు అంతర్జాతీయ ఒత్దిళ్లకు తలొగ్గే సెక్స్‌పై శాస్త్రీయ అధ్యయనం అంటూ బిల్లుపై సంతకం చేయనని ప్రకటించారు. స్వలింగసంపర్కం జన్యుపర సమస్య అవునా ? కాదా ? అని నిర్ధారించడానికి ఒక కమిటీని నియమించినట్లు అధ్యక్షుడు చెప్పారు. స్వలింగ సంపర్కం ఒక సామాజిక విలక్షణమైన ప్రవర్తన అని, జన్యుపర లోపం కాదని కమిటీ నిర్ధారించడంతో రెండు వారాల క్రితం అతను బిల్లుపై సంతకం చేస్తానని ప్రకటించాడు.

ఉగండాలో స్వలింగ సంపర్కం సహజం కాదు. కాని.. పాఠశాలల్లో స్వలింగ సంపర్కుల భారీగా నియామకాలు జరిగాయి. ముఖ్యంగా యువతలో, ప్రజలు అలా పుడతారనే అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని "అని నీతి , సమగ్రత మంత్రి సైమన్ లోకోడో చెప్పారు. అధ్యక్షుడి మద్దతు ఉన్న ఈ బిల్లును రాబోయే వారాల్లో పార్లమెంటులో తిరిగి ప్రవేశపెడతామన్నారు. ఈ ఏడాది చివరిలోపు బిల్లును ఓటింగ్‌కు తీసుకొస్తామని ఎథిక్స్ అండ్ ఇంటిగ్రెటి మంత్రి సైమన్ లోకోడో చెప్పారు.

దీంతో వందలాది ఎల్‌జిబిటిలు శరణార్థులుగా దేశం విడిచి వెళ్ళవలసి వస్తుందని ఉగండా మంత్రి ప్రకటించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఎల్‌జిబిటి హక్కుల కోసం పోరాడినా, మద్దతు ఇచ్చినా , రక్షించినా కూడా నేరమే అవుతుంది.

ఈ సంవత్సరం ఆరంభంలో స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా మరణశిక్ష విధించే ప్రణాళికలపై బ్రూనైపై అంతర్జాతీయంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. తీవ్రమైన విమర్శల తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు అదే బాటలో ఉగండా ఉంటుందేమో చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story