ఆ ట్రస్ట్‌ను కేంద్రం రద్దు చేసిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 12:28 PM GMT
ఆ ట్రస్ట్‌ను కేంద్రం రద్దు చేసిందా..?

అమరావతి : విదేశీ నిధుల ప్రవాహాన్ని నియంత్రించే చట్టం ఆధారంగా కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ లో 168 స్వచ్ఛంద సేవా సంస్థల్ని, తెలంగాణలో 90 స్వచ్ఛంద సేవాసంస్థల్ని రద్దు చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందినదిగా ప్రచారమవుతున్న వై.ఎస్.విజయమ్మ స్వచ్ఛంద సేవాసంస్థకూడా ఉంది.

పెద్ద మొత్తంలో చట్టవిరుద్ధంగా భారీగా నిధుల్ని బదిలీ చేసినందుకుగాను వై.ఎస్.విజయమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ అనుమతి రద్దయ్యిందని కొందరు తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు.

న్యూస్ మీటర్ ఈ విషయాన్ని లోతుగా పరిశోధించి, ఎఫ్.ఆర్.సి.ఐ నోటీసుల్ని క్షుణ్ణంగా పరిశీలించి నిజాల్ని వెలికితీసింది. 2011 నుంచి 2016 ఆర్థిక సంవత్సరాలవరకూ సాంవత్సరిక నివేదికలను సమర్పించక పోవడం వల్ల కేంద్రం ఈ స్వచ్ఛంద సేవా సంస్థ అనుమతిని రద్దు చేసింది.

Misinformation 1

నిబంధనల ప్రకారం స్వచ్ఛంద సేవా సంస్థలు తమ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలతోకూడిన సాంవత్సరిక నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో 168 వెబ్ సైట్ లు, తెలంగాణలో 90 వెబ్ సైట్ లు ఇలా సాంవత్సరిక నివేదికలను సమర్పించలేదు. ఆ కారణంగా ఎఫ్.సి.ఆర్.ఐ వాటి రిజిస్ట్రేషన్ ను రద్దు చేసింది. న్యూస్ మీటర్ చేసిన స్వచ్ఛంద పరిశోధనలో ఈ ట్రస్ట్ కు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. పరిశోధనలో తేలిన అంశం ఏంటంటే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యాలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో ఉంది. న్యూస్ మీటర్ ప్రతినిధి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగి వివరాలు తెలుసుకున్నప్పుడు అసలు ఈ ట్రస్ట్ తో ముఖ్యమంత్రి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ అధికారులు తెలియజేశారు.

Misinformation 2

ఈ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ తోపాటుగా 2010 విదేశీ నిధుల చట్టం ప్రకారం ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్ రద్దయ్యింది. అనుమతి రద్దయిన సంస్థల్లో కొన్ని హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ప్రధాన కార్యాలయాలు కలిగి ఉండి అక్కడినుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వై.ఎస్.విజయమ్మ ట్రస్ట్ తోపాటుగా సేవాభారతి ట్రస్ట్, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ లకు కూడా అనుమతి రద్దయ్యింది.

Next Story