తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో.. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. అయితే..తాత్కాలిక డ్రైవర్‌, కండర్లకు ప్రభుత్వం రోజు వారి కూలీగా రూ.1750 చెల్లిస్తున్నారు.
కాని..ఇప్పడు కేవలం రూ.900 మాత్రమే ఇస్తుండటంతో.. తాత్యాలిక ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెకు దిగారు. దీనిలో భాగంగా మహేశ్వరం డిపోలో ఉదయం నుంచి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళకుండా అడ్డుకున్నారు.

డీఎం రవీంధర్‌ తమను వేధిస్తున్నారని తాత్కాలిక కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.1750 ఇస్తామని చెప్పి..ఆదాయం రాకుంటే..రూ.900 ఇస్తున్నారని ఇది ఎక్కడి న్యాయమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కానీ..డీఎం రవీంధర్ మాత్రం లీటర్‌ డీజీల్‌కు రెండు కిలోమీటర్ల మైలేజ్‌ వస్తుందని..దీంతో రోజుకు రూ.2 లక్షల ఖర్చు అవుతుందని..ఆదాయం మాత్రం రూ.50 వేలే ఎందుకు వస్తుందని వేధింపులకు గురిచేస్తున్నాడని కార్మికులు వాపోయారు.

ఈ నేపథ్యంలోనే సీఎంతో చెప్పి డీఎంను తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఆర్డీవోను కోరుతామని హెచ్చరించారు. దీంతో ఏమీ జరుగుతుందో అర్థం కాక తెల్ల మోహం వేసిన డీఎం రవీందర్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు.

ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికులు భేషరతుగా విధుల్లోకి చేరాలని సీఎం కేసీఆర్ హెచ్చరించడంతో కార్మికుల్లో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతోంది. ఇప్పటికే పలు డిపోల్లో ఆర్టీసీ కార్మికులు రిపోర్ట్ చేస్తూ విధుల్లో చేరుతున్నారు. తాజాగా 22 మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యోగంలో చేరారు. ఐదుగురు డ్రైవర్లు, ఏడుగురు కండక్టర్లు, ఏడుగురు అసిస్టెంట్‌ మేనేజర్లు, సూపరింటెండెంట్‌, రికార్డు ట్రేసర్‌, మెకానిక్‌ ఒక్కొక్కరు విధుల్లో చేరారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.